మా భవిష్యత్‌ ఏమిటి ?

ABN , First Publish Date - 2021-03-11T06:07:32+05:30 IST

మా కుటుంబ జీవనం ఎలా గడుస్తుందో.. భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలియడం లేదని దెందులూరు నియోజకవర్గ రేషన్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

మా భవిష్యత్‌ ఏమిటి ?
పెదవేగిలో సమావేశానికి హాజరైన రేషన్‌ డీలర్లు

 రేషన్‌ డీలర్ల ఆందోళన 

పెదవేగి, మార్చి 10 : మా కుటుంబ జీవనం ఎలా గడుస్తుందో.. భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలియడం లేదని దెందులూరు నియోజకవర్గ రేషన్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పెదవేగి, దెందులూరు, పెదపాడు మండలాలకు చెందిన రేషన్‌ డీలర్లు పెదవేగి మండలం చక్రాయగూడెంలో బుధవారం సమావేశం నిర్వహించి కార్యాచరణపై సమీక్షించారు. రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి పామర్తి రవికుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే ఇంటింటికి రేషన్‌ పథకానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం ఏ పథకం పెట్టినా మేము పూర్తిగా సహకరిస్తామన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మా భవిష్యత్‌ అందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం డీలర్ల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంఘ అధ్యక్షుడు తలారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2021-03-11T06:07:32+05:30 IST