100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

ABN , First Publish Date - 2021-12-19T06:28:03+05:30 IST

నేటి విద్యార్థులు నవ భారత నిర్మాణంలో ముందుకు సాగాలని కేజీఆర్‌ఎల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె. రామచంద్రమూర్తి అన్నారు.

100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 18 : నేటి విద్యార్థులు నవ భారత నిర్మాణంలో ముందుకు సాగాలని  కేజీఆర్‌ఎల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె. రామచంద్రమూర్తి అన్నారు. కళాశాలల ఆవరణలో జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో శనివారం ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహించారు.  రామచంద్రమూర్తి మాట్లాడుతూ  సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. అనంతరం 100 మీటర్ల జాతీయ జెండాతో  ర్యాలీ నిర్వహించారు.  ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ సుధాకర్‌రావు, చెరుకువాడ రంగసాయి, నరసింహరావు  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T06:28:03+05:30 IST