పది రెట్లు బాదుడు

ABN , First Publish Date - 2021-11-02T05:59:47+05:30 IST

ఆదాయం పెంపుకోసం ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది.

పది రెట్లు బాదుడు

 క్వారీ అనుమతులకు సెక్యూరిటీ డిపాజిట్‌ పెంపు

 గతంలో హెక్టారుకు రూ.50 వేలు.. ప్రస్తుతం రూ. 5 లక్షలు 

 సీనరేజీ రెట్టింపు.. క్యూబిక్‌ మీటర్‌కు రూ. 90

 (తాడేపల్లిగూడెం– ఆంధ్రజ్యోతి):

ఆదాయం పెంపుకోసం ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది. క్వారీల అనుమతి కోసం సెక్యూరిటీ డిపాజిట్‌ పరిమితిని పది రెట్లు పెంచింది. సీనరేజీ చార్జీలను రెట్టింపు చేసింది. దాంతో అనుమతు లు తెచ్చుకున్న యజమానులు లబోదిబోమం టున్నారు. మెటల్‌, కంకర మట్టి ధరలు పెరిగి పోనున్నాయని కొనుగోలుదారులు గగ్గోలు పెడుతు న్నారు. మరోవైపు అక్రమ తవ్వకాలు పెరిగి ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అధికారికంగా తవ్వకాలు సాగించే వారికి నష్టం వాటిల్లనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం క్వారీ యజమానులు, కొనుగోలుదారు లపై భారం మోపింది. గతంలో క్వారీ అనుమతి పొందాలంటే రూ. 50 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లిస్తే సరి పోయేది. ఈ ఏడాది నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ.5లక్షలకు పెంచారు. ఒకేసారి పది రెట్లు పెంచడంతో క్యారీ యజమా నులు అల్లాడిపోతున్నారు. ఒకవైపు డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి. మరోవైపు ప్రభుత్వం అనుమతుల ధరలు పెంచింది.  దాంతో ధరలు పెంచకపోతే క్వారీ నిర్వహణ గిట్టుబాటు అయ్యే అవకాశం ఉండదు. నిర్మాణ రంగానికి సంబం ధించి ఇప్పటికే సిమెంట్‌, ఐరన్‌. ఇనుము ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల మెటల్‌, కంకర ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆరు యూనిట్‌ల మెటల్‌ చిప్స్‌ రూ. 18 వేలు ఉంటోంది. దీని ధర మరింత పెరగనుంది. లారీ కంకర దూరాన్ని బట్టి రూ. 8వేల ధర పలుకు తోంది. ప్రస్తుతం సీనరేజీ కూడా పెంచడంతో ధరలు మరింతగా పెంచే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పటివరకు క్యూబిక్‌ మీటర్‌పై సీనరేజీ రూ.45 ఉండేది. ప్రభుత్వం దానిని రూ.90 లకు పెంచింది. దీనివల్ల అదనపు భారం పడుతోంది. అక్రమంగా తవ్వకాలు సాగించేవారికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండడం లేదు. తక్కువ ధరలకే కంకరమట్టిని సరఫరా చేస్తున్నారు. అదే అన్ని అనుమతులు తెచ్చుకున్న వారు మాత్రం అధిక ధరలకు అమ్మ కాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్రమ తవ్వకాలపై అధికారులు దృష్టి సారించినప్పుడే అనుమతి ఉన్న క్వారీలకు న్యాయం జరుగుతుంది. 


Updated Date - 2021-11-02T05:59:47+05:30 IST