మద్యం మత్తులో కొట్లాట: ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-06-21T06:26:30+05:30 IST

నల్లజర్ల మండలం ఆవపాడులో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒక వ్యకి మృతి చెందాడు.

మద్యం మత్తులో కొట్లాట: ఒకరి మృతి
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

నల్లజర్ల, జూన్‌ 20: నల్లజర్ల మండలం ఆవపాడులో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒక వ్యకి మృతి చెందాడు. నల్లజర్ల ఎస్‌ఐ అవినాష్‌ కథనం ప్రకారం గ్రామానికి చెందిన పోడే దుర్గ ప్రసాద్‌ (35)ను అదే గ్రామానికి చెందిన అచ్యుత సుబ్బారావు మద్యం మత్తులో నెట్టడంతో దుర్గాప్రసాద్‌ తలకి బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తాడేపల్లిగూడెం సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-06-21T06:26:30+05:30 IST