పట్టిసీమకు పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2021-11-29T04:50:11+05:30 IST
పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది.

పోలవరం, నవంబరు28: పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. జిల్లాలో పలు ప్రాంతాల భక్తులు, భవాని, అయ్యప్పస్వామి మాలధా రులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ సిబ్బంది భ క్తులకు అన్నదానం, ప్రసాద వితరణ చేశారు. సుమారు 1500 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్న ట్లు ఆలయ సిబ్బంది వెంకట్రాజు తెలిపారు. రేవు పాటదారులు భక్తులను రేవు దాటించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఫెర్రీ పాయింట్ వద్ద తోపులాటలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు.