ఎన్‌ఎంయూదే విజయం

ABN , First Publish Date - 2021-12-15T05:41:16+05:30 IST

భీమవరం ఆర్టీసీ డిపోలో మంగళవారం రసవత్తరంగా జరిగిన సీసీఎస్‌ ఎన్నికల్లో ఎన్‌ఎంయూఏ అభ్యర్థి విజయం సాధించాడు.

ఎన్‌ఎంయూదే విజయం
భీమవరంలో విజయం సాధించిన వెంకట్రావు


భీమవరంలో 48, నరసాపురంలో 26 ఓట్లతో విజయకేతనం  


భీమవరం క్రైం, డిసెంబరు 14 : భీమవరం ఆర్టీసీ డిపోలో మంగళవారం రసవత్తరంగా జరిగిన సీసీఎస్‌ ఎన్నికల్లో ఎన్‌ఎంయూఏ అభ్యర్థి విజయం సాధించాడు.  మొత్తం 360 ఓట్లు పోలవ్వగా రెండు చెల్లని ఓట్లు 358 ఓట్లకు లెక్కింపు జరిగింది. ఎన్‌ఎంయూ అభ్యర్థి వై.వెంకట్రావుకు 190 ఓట్లు, ఎంప్లా యీస్‌ యూనియన్‌ అభ్యర్థి డీఎం కృష్ణకు 142 ఓట్లు, డ్రైవర్స్‌ అసోసియేషన్‌ అభ్యర్ధి డీవీహెచ్‌ హనుమంతరావుకు 26 ఓట్లు పోలయ్యాయి. వెంకట్రావు 48 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. డీఎం మహేంద్రుడు,అధికారులు అభినందించారు. సీఐ కృష్ణభగవాన్‌ పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.


నరసాపురం : కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ విజ యం సాధించింది. ఎన్‌ఎంయూ అభ్యర్థిగా పోటీ చేసిన శివప్రసాద్‌ 26 ఓట్లు మెజార్టీతో విజయం సాఽధించారు.ఎంప్లాయీస్‌, ఏఐటీయూసీల యూనియన్‌ తరపున బరిలో నిలిచిన కడలి రాంబాబుకు 111 ఓట్లు రాగా శివప్రసాద్‌కు 137 ఓట్లు వచ్చాయి. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు డిపో ప్రాంగణంలో పోలింగ్‌ జరిగింది. మొత్తం 251 ఓట్లకు 248 మంది ఓటు వినియోగించుకున్నారు.ఎన్నికల అధికారిగా డీఎం శివాజీ వ్యవహరించారు. 

Updated Date - 2021-12-15T05:41:16+05:30 IST