జూనియర్‌ కళాశాలలో కనీస వసతులు కల్పించండి

ABN , First Publish Date - 2021-12-08T05:05:48+05:30 IST

స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మౌ లిక వసతులు కల్పించాలని, అధ్యాపక సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు.

జూనియర్‌ కళాశాలలో కనీస వసతులు కల్పించండి
గోపాలపురంలో వినతిపత్రం ఇస్తున్న విద్యార్థి నాయకులు

గోపాలపురం, డిసెంబరు 7: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మౌ లిక వసతులు కల్పించాలని, అధ్యాపక సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి పై బైఠాయించి నినాదాలు చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చింతల పూడి సునీల్‌ ఆధ్వర్యంలో కళాశాల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నప్పటికి అధ్యాపకులు లేక పాఠ్యాంశాలు పూర్తికాలేదన్నారు. గతంలో ఎన్నోమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ముక్కా మల పవన్‌కుమార్‌, మండల కార్యదర్శి కే.నారాయణ, కే.మహేష్‌, ఎన్‌.రాజు, కే.సంతోష్‌, సందీప్‌, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:05:48+05:30 IST