ఆ సంతకాలు మావి కాదు

ABN , First Publish Date - 2021-02-02T05:18:23+05:30 IST

మండలంలోని వడ్డిలంక 6వవార్డు, 8వ వార్డు సభ్యులుగా నామినేషన్‌ పత్రాలలో ప్రతిపాదించిన సంత కాలు తమవి కావని ప్రతిపాదితులుగా పేర్కొన్నవారు అధికారులకు తెలియజేశారు.

ఆ సంతకాలు మావి కాదు
ఆర్వోకు ఫిర్యాదు చేస్తున్న భవాని

వడ్డిలంకలో ప్రతిపాదితుల ఫిర్యాదు


యలమంచిలి, ఫిబ్రవరి 1: మండలంలోని వడ్డిలంక 6వవార్డు, 8వ వార్డు సభ్యులుగా నామినేషన్‌ పత్రాలలో ప్రతిపాదించిన సంత కాలు తమవి కావని ప్రతిపాదితులుగా పేర్కొన్నవారు అధికారులకు తెలియజేశారు. నారిన మెరక పంచాయతీ కార్యా లయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పి.బాబూరావుకు సోమవారం వినతిపత్రాలను అందిం చారు. 6వ వార్డు అభ్యర్థిగా పోతురాజు విక్టోరియా రాణి నామినేషన్‌ పత్రాలలో ప్రతిపాదితుడు కామన నాగబాబు, 8వ వార్డు అభ్యర్థిగా తమ్మినీడి అన్నపూర్ణ నామినేషన్‌పత్రాలలో ప్రతిపాదిత వ్యక్తిగా పేర్కొన్న బళ్ళ నాగ దుర్గా భవాని ఆ సంతకాలు తమవి కాదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ సంత కాలు ఫోర్జరీ చేసినట్టు ఆర్‌వోకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్‌వో బాబూరావుని వివరణ కోరగా ఉన్నతాధికారులకు నివేదించామని, అభ్యంతరాల పరిశీలనలో సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని వారికి సూచించినట్టు తెలిపారు.

Updated Date - 2021-02-02T05:18:23+05:30 IST