యువత క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలి

ABN , First Publish Date - 2021-03-23T05:04:26+05:30 IST

యువత క్రీడల్లో ప్రావీణ్యం సంపాదిం చాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సూచించారు.

యువత క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలి
విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌

భీమవరం టౌన్‌, మార్చి 22: యువత క్రీడల్లో ప్రావీణ్యం సంపాదిం చాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సూచించారు. లూథరన్‌ గ్రౌండ్‌లో 16 రోజులు పాటు జరిగిన ప్రీమియం లీగ్‌ క్రికెట్‌ విజేతలకు సోమవారం బహుమతులను అందజేశారు. ఫైనల్‌ మ్యాచ్‌లో భీమవరం – హైదరాబాద్‌ జట్లు తలపడగా భీమవరం జట్టు విజయం సాధించింది. విజేత జట్టు సభ్యులకు ట్రోఫీ నగదు అందించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు, గూడూరి ఓంకార్‌, తోట భోగయ్య, ఆర్గనైజర్‌ చందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T05:04:26+05:30 IST