మనస్తాపంతో గర్భిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-23T05:26:53+05:30 IST

భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో తీవ్ర మన స్తాపానికి గురైన నాలుగు నెలల గర్భిణి ఉరి వేసుకుని సోమ వారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది.

మనస్తాపంతో గర్భిణి ఆత్మహత్య

ఏలూరు క్రైం, మార్చి 22: భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో తీవ్ర మన స్తాపానికి గురైన  నాలుగు నెలల గర్భిణి ఉరి వేసుకుని సోమ వారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. తాడేపల్లిగూడెం సమీపంలోని పెంట పాడునకు చెందిన శిరీష (25) బీటెక్‌ చదివింది. రెండేళ్ల క్రితం ఏలూరు లోని బీడీ కాలనీకి చెందిన బత్తుల సాయి కిరణ్‌తో ఈమెకు వివాహ మైంది.  సాయికిరణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజ నీర్‌. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోమ్‌ కావడంతో బీడీ కాలనీలోనే తల్లిదండ్రులు, భార్య, పది నెలల కుమారుడు ఉంటున్నారు. ప్రస్తుతం శిరీష నాలుగో నెల గర్భిణీ. ఇటీవల ఇద్దరు గొడవ పడుతున్నారు. ఆదివారం రాత్రి గొడవ పడినట్టు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శిరీష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఏలూరు ప్రభుత్వా స్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించా రు. వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఔట్‌ పోస్టు పోలీసులకు సమాచారం అందించడంతో ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ చావా సురేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-23T05:26:53+05:30 IST