ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

ABN , First Publish Date - 2021-02-07T05:17:08+05:30 IST

ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాల్‌ట్‌తో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎంపీడీవో పోశింశెట్టి రమాదేవి సూచించారు.

ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌
ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఉపాధ్యాయురాలు

ఆకివీడు, పిబ్రవరి 6: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాల్‌ట్‌తో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎంపీడీవో పోశింశెట్టి రమాదేవి సూచించారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శనివారం పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సును ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యో గులు తమ ఓటుహక్కును మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టెలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఆదే శాలు తాము అమలు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-02-07T05:17:08+05:30 IST