ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు చెప్పాలి

ABN , First Publish Date - 2022-01-01T05:10:41+05:30 IST

అంబేడ్కర్‌ వల్ల హక్కులు రాలేదని బాబూ జగ్జీవన్‌రామ్‌ వల్లే వచ్చాయని మతి భ్రమించి మాట్లాడిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి కాళ్లుపట్టుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్‌ ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు చెప్పాలి

ఆచంట/భీమవరం/పాలకొల్లు, డిసెంబరు 31 : అంబేడ్కర్‌ వల్ల హక్కులు రాలేదని బాబూ జగ్జీవన్‌రామ్‌ వల్లే వచ్చాయని మతి భ్రమించి  మాట్లాడిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి కాళ్లుపట్టుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్‌ ధ్వజమెత్తారు. ఆచంటలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస పరిజ్ఞానం లేకుండా అంబేడ్కర్‌ని కించపరిచివాఖ్యలు చేయ డం దళిత జాతిని యావత్తు కించ పరిచినట్లేనన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి మైలాబత్తుల ఐజాక్‌బాబు డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ భిక్షతో గెలిచి ఇలా మాట్లాడటం సిగ్గు చేటని గంటా సుందర్‌కుమార్‌ అన్నారు. శ్రీదేవి వ్యాఖ్య లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కబర్ది ఖండించారు. గతంలో శ్రీదేవి పేకాటలో వాటాల కోసం పాకులాడి దళిత జాతి సిగ్గు పడేలా వ్యవహరించిందని గుర్తు చేశారు.

Updated Date - 2022-01-01T05:10:41+05:30 IST