భీమవరంలో పోలీస్‌ ఓపెన్‌ హౌస్‌

ABN , First Publish Date - 2021-10-30T05:00:12+05:30 IST

పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రజల రక్షణకే కాకుండా ఆరోగ్య సంరక్షణకు పాటుపడుతుందని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు.

భీమవరంలో పోలీస్‌ ఓపెన్‌ హౌస్‌
భీమవరంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మతో విద్యార్థినులు, మహిళా పోలీసులు

పోలీస్‌ విధులపై అవగాహన కల్పించిన ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ


భీమవరం క్రైం, అక్టోబరు 29 :  పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రజల రక్షణకే కాకుండా ఆరోగ్య సంరక్షణకు పాటుపడుతుందని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం నరసాపురం సబ్‌ డివిజన్‌ భీమవరం వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ప్రాణదా నంతో సమానమన్నారు. ఓపెన్‌ హౌస్‌, పోలీస్‌ వెపన్స్‌, మహిళా మిత్ర, ట్రాఫిక్‌ పోలీస్‌, ఫైరిం జన్‌ స్టాల్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిం చారు.కరోనా సమయంలో విశేష సేవలందించిన చెరుకువాడ రంగసాయి, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు నందమూరి రాజేష్‌, అల్లు శ్రీనివాస్‌ తదితరులను అభినందించారు.ఈ కార్యక్రమంలో నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు కృష్ణభగవాన్‌, కృష్ణకుమార్‌, వన్‌టౌన్‌, టూటౌన్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:00:12+05:30 IST