అమరవీరుల త్యాగాలు అజరామరం
ABN , First Publish Date - 2021-10-22T04:22:36+05:30 IST
నిరంతరం ప్రజలకు భద్రత కల్పిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరమని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు.

గణపవరం, అక్టోబరు 21: నిరంతరం ప్రజలకు భద్రత కల్పిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరమని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. గురువారం గణపవరంలో పోలీసు లు, పీఎంపీల అసోసియేషన్, మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహి ంచారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల విష్ణు శ్రీనివాసరావు, గాదిరాజు సుబ్బరాజు, సీఐ వి.వెంకటేశ్వరరావు, ఎస్సైలు వీరబాబు, గురవయ్య, పీఎంపీల జిల్లా అధ్యక్షుడు ఏఆర్‌కే పరమేశ్వరులు, మానవత జిల్లా కన్వీనర్ సాగిరాజు జానకిరామరాజు, సీహెచ్ ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.
తణుకు: పోలీసుల త్యాగాలు మరువలేనివని పట్టణ ఎస్‌ఐ గంగాధర్ అన్నారు. గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం నరేంద్ర సెంట ర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రాణా లను లెక్కజేయడకుండా విధి నిర్వహణలో ఉంటారన్నారు. ప్రాణాలు కోల్పోయి న పోలీసు కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
పెంటపాడు: అమరవీరుల సంస్మరణ దినం గురువారం అలంపురం జడ్పీ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖలో సీఐగా పనిచేస్తూ అస్సోం వరదలలో ప్రజారక్షణ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన పాఠశాల పూర్వ విద్యార్థి మారుతీ దినకర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం సీఐ రవికుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో వందలాది మంది పోలీసులు ప్రజా సేవ చేస్తూ ప్రాణాలను కోల్పోయారన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ శాఖ సీఐ సందీప్‌కుమార్, మాజీ ఎంఈవో ఏ.వీ.రామరాజు, ఇన్‌చార్జి హెచ్‌ఎం నరేంద్ర, ఎంపీటీసీ కోంపల్లె పుష్ప, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ మల్లపు శిరీషా పాల్గొన్నారు.
ఇరగవరం: ఇరగవరం పోలీసు స్టేషన్ వద్ద ఏఎస్సై సీహెచ్ వాణిదేవి ఆధ్వర్యంలో గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం నిర్వహిం చారు. అమరవీరుల చితప్రటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సంతా పం తెలిపారు. అనంతరం గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ర్యాలీ నిర్వహించారు.
తాడేపల్లిగూడెం రూరల్: ప్రజా రక్షణ కోసం పనిచేసి అమరవీరులైన పోలీసుల త్యాగం మరిచిపోలేనిదని సీఐలు ఆకుల రఘు, వీరా రవికుమార్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్ సర్కిల్ కార్యాలయాల ఆధ్వర్య ంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్సైలు బి.రాజు, బిజే ప్రసాద్, ఎన్. శ్రీని వాస్ పాల్గొన్నారు.