అగరవత్తుల బిల్లులతో.. సిగరెట్లు దిగుమతి..

ABN , First Publish Date - 2021-12-31T05:23:03+05:30 IST

నకిలీ బిల్లులతో సిగరెట్లను వేరే ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు భీమవరం సీఐ కృష్ణభగవాన్‌ తెలిపారు.

అగరవత్తుల బిల్లులతో.. సిగరెట్లు దిగుమతి..

అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపారం
1.91 లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం


భీమవరం క్రైమ్‌, డిసెంబరు 30 : నకిలీ బిల్లులతో సిగరెట్లను వేరే ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు భీమవరం సీఐ కృష్ణభగవాన్‌ తెలిపారు. పట్టణానికి చెందిన పెరుమాళ్ళ వెంకట రాధాకృష్ణమూర్తి ఇతర ప్రాంతాల నుంచి అగరవత్తుల బిల్లులు పెట్టి ఆర్టీసీ కార్గో ద్వారా పట్టణానికి సిగరెట్లు తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద రూ.1.91 లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-12-31T05:23:03+05:30 IST