బారికేడ్‌ తొలగిస్తే.. కేసు నమోదు చేశారు..

ABN , First Publish Date - 2021-05-05T05:44:31+05:30 IST

జాతీయ విపత్తుల చట్టం, అంటు వ్యాధుల నివా రణ చట్టం ప్రకారం ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎస్‌ ప్రియకుమార్‌ మంగళవారం తెలిపారు.

బారికేడ్‌ తొలగిస్తే.. కేసు నమోదు చేశారు..

మొగల్తూరు,మే 4 : జాతీయ విపత్తుల చట్టం, అంటు వ్యాధుల నివా రణ చట్టం ప్రకారం ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎస్‌ ప్రియకుమార్‌ మంగళవారం తెలిపారు. మొగల్తూరు రెడ్‌ జోన్‌గా ప్రకటించినందున గ్రామంలోకి వచ్చే రహదారులన్నీ మూసివేశామ న్నారు.దీనిలో భాగంగానే కొండావారిపాలెం నుంచి పాతకాలువ సెంటర్‌కు వచ్చే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి రెండ్‌ జోన్‌గా తెలిపే బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. అయితే గత రాత్రి పాతకాలువ సెం టర్‌కు చెందిన పడవల ఏడుకొండలు బారికేడ్లు తొలగించినట్టు తమ విచారణలో తేలడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2021-05-05T05:44:31+05:30 IST