కొవ్వూరులో పోలీసుల రక్తదాన శిబిరం
ABN , First Publish Date - 2021-10-30T05:16:30+05:30 IST
విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు.

కొవ్వూరు, అక్టోబరు 29: విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. లిటరరీ క్లబ్‌లో శుక్రవారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణ సీఐ పి.సునీల్‌కుమార్ మాట్లాడుతూ కొవ్వూరు సర్కిల్, పట్టణ పోలీస్టేషన్ పరిధిలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీలు, ఓపెన్ హౌస్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కొవ్వూరు రూరల్ సీఐ వైవి. రమణ, పట్టణ, రూరల్ ఎస్‌ఐలు బి.శ్రీనివాస్, జి.సతీష్, తాళ్లపూడి, దేవర పల్లి ఎస్‌ఐలు కె.వెంకటరమణ, కె.శ్రీహరిరావు, పోలీసు యూనియన్ జిల్లా ట్రెజరర్ ఏకే.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
కొవ్వూరు బస్టాండ్ సెంటర్‌లో పోలీస్ బ్యాండ్
పోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వూరు బస్టాండ్ సెంటర్‌లో శుక్రవారం పోలీస్ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. పట్టణ సీఐ పి.సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల గౌరవార్థం ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు రూరల్ సీఐ వై.వి.రమణ తెలిపారు.