22వ రోజు నిర్వాసితుల నిరసన దీక్షలు

ABN , First Publish Date - 2022-01-01T04:44:25+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలు శుక్రవారం 22వ రోజుకు చేరుకున్నాయి.

22వ రోజు నిర్వాసితుల నిరసన దీక్షలు
నిరసన దీక్షలో నిర్వాసితులు

పోలవరం, డిసెంబరు 31: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలు శుక్రవారం 22వ రోజుకు చేరుకున్నాయి. తమకు పరిహారం చెల్లించ కుండా ప్రభుత్వం కాఫర్‌ డ్యాం మూసివేయడంతో ముంపు సమస్య ఎదుర్కొం టున్నామన్నారు. నిరసన దీక్షల కోసం రాకపోకలు సాగించే అవకాశం లేక బస్‌ షెల్టర్‌లో పడుకుని, గోదావరిలో స్నానం చేస్తూ దాతల సహకారంతో కడుపు నింపుకుంటున్నామన్నారు. ఉన్న ఊరు కన్న వారిని వదిలి ఉద్యమం చేస్తున్నా మని, అయినా అఽధికారులు జాప్యం చేస్తూ తమ సహనాన్ని పరిక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటుంటే తాము కనీసం తాగునీరు, విద్యుత్‌ లేని ముంపు గ్రామాల్లో అవస్థలు పడుతు న్నామని వాపోయారు. తమకు సత్వరం న్యాయం చేయకుంటే పునరావాసాల కు వచ్చిన నిర్వాసితులతో సహా స్వగ్రామాలకు తరలిపోతామని హెచ్చరిం చారు. శుక్రవారం నిరసన దీక్షల్లో వెంకటస్వామి, సత్యనారాయణ రెడ్డి, కారం వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T04:44:25+05:30 IST