రేపటి నుంచి పోలవరం నిర్వాసితుల దీక్షలు
ABN , First Publish Date - 2021-12-09T05:42:03+05:30 IST
తమకు అందాల్సిన పరిహారాలు, ప్యాకేజీల సాధన కోసం ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు పోల వరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక బుధవారం ఒక ప్రకటనలో తెలి పింది.

పోలవరం, డిసెంబరు 8 : తమకు అందాల్సిన పరిహారాలు, ప్యాకేజీల సాధన కోసం ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు పోల వరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక బుధవారం ఒక ప్రకటనలో తెలి పింది. పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న ముంపు గ్రామాలకు చెందిన సుమారు ఐదు వందల కుటుంబాలు అధికారుల హామీల మేరకు నిర్వాసిత గ్రామాలను విడిచి కట్టుబట్టలతో మైదాన ప్రాంతాలకు తరలి వచ్చామని, అయితే సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కొత్త ప్రాంతాల్లో ఉపాధి లేక పోషణ భారమై అవస్థలు పడుతున్నామని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వాపో యారు. దీనికి నిరసనగా ఈనెల 10 నుంచి పోలవరం ఏటిగట్టు సెంటర్‌లో శాంతియుతంగా నిరసన దీక్షలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. పోలవరం తహసీల్దారు, ఎస్‌ఐలకు విన తిపత్రాలు సమ ర్పించినట్టు చీడూరు, శివ గిరి తదితర ముంపు గ్రామాల నిర్వాసితులు తెలిపారు.