దీక్షలు విరమించేది లేదు

ABN , First Publish Date - 2021-12-31T05:20:11+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన దీక్షలు విరమించేది లేదని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక స్పష్టం చేసింది.

దీక్షలు విరమించేది లేదు
నిర్వాసితులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

ఎమ్మెల్యే బాలరాజుకు స్పష్టం చేసిన నిర్వాసితుల ఐక్య వేదిక


పోలవరం, డిసెంబరు 30: తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన దీక్షలు విరమించేది లేదని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. వారు దీక్షలు గురువారం నాటికి 21వ రోజుకు చేరాయి. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నిరసన దీక్షల శిబిరానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లా డారు. పది రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, నిర్వాసితులను నేరుగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళతానని, దీక్షలు విరమించాలని ఆయన కోరారు. తమ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాకే దీక్షలు విరమిస్తామని వారు స్పష్టం చేశారు. ముంపు గ్రామాలకు రాకపోకలు సాగించడానికి పోలవరం ప్రాజెక్టు వద్ద భద్రతా బలగాలు నిర్వాతులను నిలిపివేస్తున్నారని, నిత్యావసరాలకు, వైద్య సదుపాయాలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. రాకపోకలు సాగించడానికి అనుమతి  ఇప్పించాలని నిర్వాసితులు, ఐక్యవేదిక నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే ఫోన్‌లో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రాకపోకలకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు బి.సుమతి, సీఐ కె.విజయబాబు, ఎంపీడీవో సీహెచ్‌.శ్రీనివాస్‌ బాబు, ఆర్‌ఐ కె.రమేశ్‌, జడ్పీటీసి కలుం హేమకుమారి, ఐక్యవేదిక నాయకులు, న్యాయవాది గెల్లా రాజేష్‌, వీరపురాజు చిట్టిబాబు, ఆదివాసి మహాసభ నాయకులు కారం వెంకటేశ్వరరావు, మిడియం వెంకట స్వామి, ముంపు గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:20:11+05:30 IST