పెట్రో మంటలు

ABN , First Publish Date - 2021-11-10T05:15:08+05:30 IST

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ పన్ను తగ్గించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

పెట్రో మంటలు
ఏలూరులో నిరసన ప్రదర్శన చేస్తున్న బడేటి చంటి, టీడీపీ నాయకులు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ టీడీపీ ఆందోళనలు
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ పన్ను తగ్గించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం  తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెట్రోలు బంకుల వద్ద ధర్నాలు చేశారు. ఏలూరు నగరంలో టీడీపీ కన్వీనర్‌ బడేటి చంటి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.  పెనుమంట్ర మండలం నెగ్గిపూడి పెట్రోల్‌ బంక్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.తాడేపల్లిగూడెంలో టీడీపీ కన్వీనర్‌ వలవల బాబ్జి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లులో ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు ఆధ్వర్యం లో నిరసన చేపట్టారు. భీమవరంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేశారు. నరసాపురంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో ఽధర్నా నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండలాల్లోని పెట్రోల్‌ బంక్‌ల వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించాలంటూ ఆందోళన చేశారు.Updated Date - 2021-11-10T05:15:08+05:30 IST