ఇంధన మంటలు
ABN , First Publish Date - 2021-10-29T05:05:07+05:30 IST
ఇంధన ధరల పెంపుపై వామపక్షాలు భగ్గుమన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

భీమవరంలో నిరసన ప్రదర్శన చేస్తున్న వామపక్ష సంఘ నాయకులు
పెట్రోల్ ధర పెంపుపై భగ్గుమన్న వామపక్షాలు
భీమవరంటౌన్/పెనుగొండ/మొగల్తూరు/పాలకొల్లుఅర్బన్/ఆచంట/యల మంచిలి/పెనుమంట్ర, అక్టోబరు 28 :ఇంధన ధరల పెంపుపై వామపక్షాలు భగ్గుమన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు రోడ్లు ఎక్కి నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు భీమవరం, పెనుగొండ, మొగల్తూరు, పాలకొల్లు, ఆచంట,పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు, యలమంచిలి మండలం కలగంపూడి హైవేపై రాస్తారోకో చేశారు. నిరసన ప్రదర్శన చేశారు.కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని సీపీఎం డెల్టా జిల్లా ప్రధాన కార్యదర్శి బి.బలరాం విమర్శించారు. ఆలిండియా ఫార్వర్డు బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, సీపీఐ నాయకుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు లీటరకు రూ.70లు సుంకం వేస్తున్నారన్నా రు.ఇంధన ధరలు పెంచ డంతో ఆ భారం నిత్యావసరాలపై పడి సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని మొగ ల్తూరు సీపీఎం మండల కార్యదర్శి కొల్లాటి బాబూరావు అన్నారు. గత ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలు ఆకాశాన్నంటించిందని జిల్లా (డెల్టా) కమి టీ సభ్యులు ఎస్.వెం కటేశ్వరరావు అన్నారు. ధరలను నియం త్రించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలపై ఉందని తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు కోరారు.తహసీల్దార్ జి.మమ్మీకి వినతిపత్రం అందజేశారు. కేంద్రం అడ్డూ అదుపు లేకుండా ఇంధన ధరలు పెంచడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ అన్నారు. నిత్యావసర ధరలు అదుపు చే యాలని సీపీఎం మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు డిమాండ్ చేశా రు.పెంచిన ధరలు తగ్గించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు. కార్యక్రమంలో వీరంశెట్టి శ్రీనివాస్, మేడపాటి రత్నారెడ్డి, శీలం శివ, కాలేపు జీవన్‌కుమార్, రాజమహేంద్రవరపు వెంకటేశ్వరరావు, యడ్ల చిట్టిబాబు, వీరా పాండు రంగారావు,పొదిల కృష్ణమూర్తి, ఆదూరి సాంబమూర్తి, జడ్డు ఆది నారా యణ,నాగేశ్వరరావు, కొత్త విజయ్ కుమార్, బాసిన శ్యామల, మల్లుల లక్ష్మీనారాయణ బి.రామారావు, బి.వాసుదేవరావు, దండు శ్రీనివాసరాజు,కనుమూరి వెంకటపతిరాజు,నడింపల్లి హరనాథరాజు, ఉన్నమట్ల దుర్గాప్రసాద్, గుత్తుల రంగారావు, మచ్చ సుబ్బారావు, సిర్రా నరసింహమూర్తి పాల్గొన్నారు.