రూ.15 లక్షల ఎరువులు, పురుగు మందులు సీజ్‌

ABN , First Publish Date - 2021-12-09T05:41:22+05:30 IST

మండలంలోని సూరపవారిగూడెంలో దుర్గా ట్రేడర్స్‌ ఎరువుల దుకాణంలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం తనిఖీ చేశారు.

రూ.15 లక్షల ఎరువులు, పురుగు మందులు సీజ్‌
తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

బుట్టాయగూడెం, డిసెంబరు 8: మండలంలోని సూరపవారిగూడెంలో దుర్గా ట్రేడర్స్‌ ఎరువుల దుకాణంలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. దుకాణ యజమాని లైసెన్స్‌ లేని ఎరువులు, పురుగుమం దులు విక్రయిస్తున్నారని అధికారు లకు సమాచారం అందింది. తనిఖీ లో పీసీ (ప్రిన్సిపల్‌ సర్టిఫికెట్‌) లేని పురుగుమందులు అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు రూ.2.60 లక్షల విలువైన మందులను సీజ్‌ చేశారు. ఓ.ఫాం లేని ఎరువులను విక్రయిస్తున్నట్లు అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు రూ. 12.51 లక్షల విలువైన ఎరువులను సీజ్‌ చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ ఎస్‌ఐ సీహెచ్‌.రంజిత్‌కుమార్‌, ఏవో ఎం.శ్రీనివాస్‌ కుమార్‌, ఏవో బి.సుమలత, వీఆర్వో శ్రీరామ్మూర్తి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:41:22+05:30 IST