సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకించండి
ABN , First Publish Date - 2022-01-01T04:41:31+05:30 IST
అమెరికా సామ్రా జ్యవాద విష సంస్కృతిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పీవైఎల్, పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

బుట్టాయగూడెం, డిసెంబరు 31: అమెరికా సామ్రా జ్యవాద విష సంస్కృతిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పీవైఎల్, పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో భారీ ప్రదర్శన, ర్యాలీ జరిగింది. టి.బాబురావు, వెట్టి భారతి, ఎస్.రామ్మోహన్ మాట్లాడుతూ డిసెంబరు 31 పేరుతో అమెరికన్ పా శ్చాత్య విష సంస్కృతిని ప్రోత్సహించడం తగదన్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత రేవ్ పార్టీలు, మందు పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రలో మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మద్యం అమ్మకాలను అధికంగా కొనసాగించడం బాధాకరమన్నారు. యు.భూషణం, బి.వినోద్, కె.నాగేశ్వరావు, రామన్న, వెంకటేశ్వరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.