వలంటీర్లతోనే పింఛన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2021-02-02T05:19:16+05:30 IST

జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే వలంటీర్లు పింఛన్ల పంపిణీని ప్రారంభించి.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగించారు.

వలంటీర్లతోనే పింఛన్‌ పంపిణీ

ఏలూరు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే వలంటీర్లు పింఛన్ల పంపిణీని ప్రారంభించి.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగించారు. అన్ని మండలాల్లోను 90.59 శాతం మందికి ఆన్‌లైన్‌ పద్ధతిలో పింఛన్ల మొత్తాలను ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని 4.13 లక్షల మందిలో 3.77 లక్షల మందికి తొలిరోజే అందించారు. వలంటీర్లు  ఫోన్లు, ట్యాబ్‌లు ఉపయోగించి ఆన్‌లైన్‌ పద్ధతిలో పింఛను పంపిణీ చేయడం కోడ్‌ ఉల్లంఘనే నంటూ విపక్షాలు నిరసిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్ల జోక్యాన్ని నివారించాలని ఎన్నికల కమిషన్‌ ప్రయత్నాలకు అఽధికారులు గండికొట్టడాన్ని నిరసిస్తు న్నారు. వలంటీర్ల ఫోన్లు, ట్యాబ్‌లు తిరిగి తీసుకోవాలని కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఇచ్చిన ఆదేశాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా వాటి ద్వారానే పంపిణీ చేసిన అధికారుల తీరును వారు తప్పుపడుతున్నారు. పింఛన్ల పంపిణీ పేరుతో వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ ‘పింఛన్ల పంపిణీ పాత పథకమే. అందువల్ల ఇది కోడ్‌ పరిధిలోకి రాదు. పాత పద్ధతిలోనే పింఛన్లు పంపిణీ చేశాం. పింఛన్లు ఎప్పటిలాగే డోర్‌ డెలివరీ చేశాం. దీనిపై ఆందోళన అక్కర్లేద’ని అన్నారు. 


Updated Date - 2021-02-02T05:19:16+05:30 IST