విద్యార్థి సంఘ నాయకుల అరెస్టుకు ఖండన
ABN , First Publish Date - 2021-11-29T05:07:30+05:30 IST
సీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలను ఎయిడెడ్‌గానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటి వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న 19 మంది పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.నాని తెలిపారు.

ఏలూరుఎడ్యుకేషన్, నవంబరు 28 :సీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలను ఎయిడెడ్‌గానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటి వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న 19 మంది పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.నాని తెలిపారు. ఏలూరు సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఆర్‌ఆర్ విద్యా సంస్థల ఏవో కార్యాలయం వద్ద ఈనెల 18న నిర్వహించిన ధర్నా సందర్భంగా సీఆర్‌ఆర్ విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ వారం రోజుల్లోగా ప్రభుత్వానికి ఎయిడెడ్ కళాశాలగానే కొనసాగించే విధంగా లేఖ పంపిస్తామని హామీ ఇచ్చి పదిరోజులైనా చర్యలులేవని వివరించారు. ఈ క్రమంలోనే ఈనెల 27న ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్టు వివరించారు. సీఆర్‌ఆర్ విద్యా సంస్థల యాజమాన్యంతో పోలీసులు కుమ్మక్కై కళాశాలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు అనుమానం కలుగుతుందని ఆరోపించారు. యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలకు భయపడే ప్రసక్తేలేదని, రెండు, మూడు రోజుల్లోగా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తామన్నారు. సమావేశంలో సంఘ నగర అధ్యక్ష, కార్యదర్శులు క్రాంతి, జానకీరాం, హేమంత్ పాల్గొన్నారు.