పరిషత్‌ ఫటాఫట్‌

ABN , First Publish Date - 2021-05-22T05:02:17+05:30 IST

సుప్రీం ఆదేశాలను సక్రమంగా పాటించకపోవడంతో గత నెలలో జరిగిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది.

పరిషత్‌ ఫటాఫట్‌

ఎన్నికలు మళ్లీ జరపాల్సిందే

హైకోర్టు తీర్పుతో తీవ్ర ఉత్కంఠ 

అభ్యర్థులు డీలా.. ఎన్నికల వ్యయం తలుచుకుని లబోదిబో

పాత ఖర్చులు  తడిసి మోపెడు

తీర్పును స్వాగతించిన విపక్షాలు

ఏలూరు, మే 21(ఆంధ్రజ్యోతి): సుప్రీం ఆదేశాలను సక్రమంగా పాటించకపోవడంతో గత నెలలో జరిగిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ఈ పదవులకు పోటీ పడిన వందల మంది అభ్యర్థులు డీలాపడ్డారు. ఎన్నికల్లో అధికార పక్షం కోట్ల రూ పాయలు వెదజల్లిందని, మిగతా పార్టీల అభ్యర్థులను భయ భ్రాంతులకు గురి చేసినట్లు అప్పట్లోనే వైసీపీయేతర పక్షాల న్నీ ఆరోపించాయి. తాజాగా పరిషత్‌ పోరును రద్దు చేసి తిరి గి రీ నోటిఫికేషన్‌ జారీచేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును విపక్షాలన్నీ స్వాగతించాయి. 

ఉత్కంఠ స్థానంలో టెన్షన్‌

జిల్లావ్యాప్తంగా 48 జడ్పీటీసీ స్థానాలకు ఏలూరు, జంగా రెడ్డిగూడెంలలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అభ్యర్థి మృతితో పెనుగొండ ఎన్నికలు నిలిపివేశారు. మిగిలిన 45 స్థానాలకు 185 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అలాగే 863 ఎంపీటీసీ స్థానాలకు, 73 ఏకగ్రీవం కాగా, తొమ్మిది మంది అభ్యర్థులు చనిపోవడంతో 781 స్థానాలకు ఎన్నికలు జరిగా యి. 2041 మంది పోటీ పడ్డారు. పార్టీల వారీగా టీడీపీ 688 స్థానాలకు, వైసీపీ 785 స్థానాలకు పోటీ పడ్డాయి. ఈ రెండు పార్టీల మధ్య దాదాపు 100 స్థానాల్లో వ్యత్యాసం ఉంది.  జన సేన నుంచి కాంగ్రెస్‌ వరకూ తమ శక్తి మేరకు అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఏప్రిల్‌ 9న ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాల్లోనూ వైసీపీ, టీడీపీ అభ్యర్థులు తలపడ్డారు. ఎన్నికల కమిషన్‌ ధోరణికి నిరసనగా టీడీపీ ఈ ఎన్నికలను బహిష్క రించడంతో చాలాచోట్ల వైసీపీ అభ్యర్థులు ఏకపక్షంగా వ్యవ హరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఓట్ల లెక్కిం పు ఫలితాలను మాత్రం న్యాయస్థానం నిలిపివేసింది. అప్పటి కే మండల పరిషత్‌ అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి అనేకమంది పోటీపడ్డారు. వారి తరపున నాయకులు పైరవీ లు నడిపారు. తమ అనుకూలురుకే ఎంపీపీ పదవి దక్కేలా లేదా వైస్‌ పదవి కనీసం చేజిక్కేలా ఎత్తుకు పైఎత్తులు నడి పారు. జడ్పీటీసీ అభ్యర్థులు తరపున ఈ ఎన్నికల ఖర్చు నుంచి మిగతా ఖర్చులను ఎమ్మెల్యేలు దాదాపు భుజానికె త్తుకున్నారు. రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులంతా ఆర్థికంగా బలహీనంగా ఉన్నా మండలస్థాయి నాయకులంతా తామే చూసుకుంటామని ముందుకు వచ్చారు. దీంతో కోట్ల రూపా యలు వెదజల్లారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు మీ కుటుంబం నుంచి వెళ్లిపోతాయంటూ పరోక్ష బెదిరింపులకు దిగారు. మరికొన్నిచోట్ల తమ పార్టీకి అడ్డు రాకూడదంటూ మిగతా పార్టీల అభ్యర్థులకు వార్నింగ్‌లు ఇచ్చారు. పరిషత్‌ పోరులో ఇలాంటి ఉత్కంఠ, ఉద్వేగం తొంగిచూసింది. 

హైకోర్టు తాజా తీర్పును విపక్ష పార్టీలన్నీ స్వాగతించాయి. అప్పట్లో తాము అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికార పక్షం ఖాతరు చేయకుండా తక్కువ సమయంలోనే పోలింగ్‌ ను నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని విమర్శలు ఉన్నాయి. తాజా తీర్పుతో నామినేషన్లు వేసిన వారంతా అభ్య ర్థులు యధావిధిగానే ఉంటారు. పోలింగ్‌ ప్రక్రియ మాత్రమే తీర్పు ప్రకారం రద్దవుతుంది. తిరిగి రీ నోటిఫికేషన్‌ వెలువడి తే మళ్లీ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ తీర్పుతో అభ్యర్థులంతా గందరగోళానికి, నిరాశకు గురయ్యారు. అధికార పక్షం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో తీర్పును సవాల్‌ చేసే అవకాశాలున్నాయని వైసీపీ లీగల్‌ సెల్‌ నేత రామాంజనేయులు తెలిపారు. 

స్వాగతించిన విపక్షాలు

‘స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జర గాలని తెలుగుదేశం ముందు నుంచి చెబు తోంది. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. అందుకే సుప్రీం మార్గదర్శకాల ప్రకారం రద్దు చేశారు. పైకోర్టుకు వెళ్లకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని నరసాపురం టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్‌ చేశారు. 


‘ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వా నికి చెంపపెట్టు. సుప్రీంకోర్టు తీర్పును తమ కు కావాల్సినట్లు ఎన్నికల కమిషన్‌ అన్వయిం చుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇకనైనా వ్యవస్థలను కాపాడి, ప్రజాస్వామ్యాన్ని గౌర వించాలి’ అని ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు.   

‘ఎన్నికల ప్రక్రియలో కోర్టుల్లో సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఒకలా, డివిజన్‌ బెంచ్‌ తీర్పు మరో లా ఉండడం ఇబ్బందిగా మారుతోంది. సింగిల్‌ బెంచీ తీర్పు బాగుందని హర్షం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే డివిజన్‌ బెంచ్‌ నుంచి భిన్నంగా తీర్పువస్తోంది. ఎన్నికల ప్రక్రి యపై కోర్టులు సమీక్షించాలి’ సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌  కోరారు.

జడ్పీటీసీ ఎంపీటీసీ

స్థానాల సంఖ్య 48 863

ఏకగ్రీవం 2 73

ఎన్నికలు జరిగినవి 45 781

పెండింగ్‌ 1 9

పార్టీల వారీగా పోటీ

టీడీపీ     43 688

వైసీపీ     45 785

జనసేన 17 245

ఇండిపెండెంట్లు 14 144

కాంగ్రెస్‌ 33 42

సీపీఎం 4 27

సీపీఐ         2 9

బీజేపీ         23 119

బీఎస్‌పీ 8 10

మొత్తం అభ్యర్థులు  187 2070 

Updated Date - 2021-05-22T05:02:17+05:30 IST