జోరువానలో ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర
ABN , First Publish Date - 2021-07-11T16:06:18+05:30 IST
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోరు వానలోనూ సైకిల్ యాత్రను కొనసాగించారు.
ఏలూరు: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోరు వానలోనూ సైకిల్ యాత్రను కొనసాగించారు. కొవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర చేపట్టారు. యలమంచిలి మండలం కలగంపూడీ గ్రామానికి 15 కిలోమీటర్లు సైకిల్‌పై గొడుగు వేసుకుని ఎమ్మెల్యే పర్యటించారు. కొవిడ్ బాధిత కుటుంబాలను పరామర్శించి పౌష్టికహారం, నిత్యావసర సరుకులను అందజేశారు.