ఆర్బీకేల వద్దే ధాన్యం కొనుగోళ్లు : జేసీ అంబేడ్కర్
ABN , First Publish Date - 2021-10-30T05:23:51+05:30 IST
రైతు భరోసా కేంద్రాల వద్దే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే కొనుగోలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు.
ఏలూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల వద్దే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే కొనుగోలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ధాన్యం సేకరణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని 874 ఆర్బీకేల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ధాన్యం సేకరణ నిమిత్తం 11 లక్షల గోనె సంచులు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రతి రైతు పంట వివరాలు ఈ క్రాప్, ఈకేవైసీ, వాలిడేషన్ నూరుశాతం జరిగి ఉండా లన్నారు. కొనుగోళ్ల పర్యవేక్షణకు మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో వ్యవసాయ శాఖ జేడీ జగ్గారావు, పౌర సరఫరాల శాఖ డీఎం బి. రాజు, డీటీసీ సిరి ఆనంద్, డీసీఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.