వరి సాగులో యాంత్రీకరణ లాభదాయకం

ABN , First Publish Date - 2021-12-10T05:11:32+05:30 IST

వరి సాగులో యాంత్రీకరణ నూ తన సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు రెండింతల ఆదాయం పొందాలని ఏడీఆర్‌ డాక్టర్‌ జోగినాయుడుతెలిపారు.

వరి సాగులో యాంత్రీకరణ లాభదాయకం

మార్టేరు వరిరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ జోగినాయుడు


పెనుమంట్ర, డిసెంబరు 9 : వరి సాగులో యాంత్రీకరణ నూ తన సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు రెండింతల ఆదాయం పొందాలని ఏడీఆర్‌ డాక్టర్‌ జోగినాయుడుతెలిపారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రైతు సహకార సంఘాల ప్రతినిధుల నైపు ణ్య శిక్షణ శిబిరం ముగింపు సభలో గురువారం ఆయన మాట్లాడారు. రైతులు విచక్షణా రహితంగా ఎరువులు విని యోగం తగ్గించాలన్నారు.  వివిధ పంటలపై నిర్వహించిన క్విజ్‌ పోటీలో కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన నరగాని జితేంద్ర ప్రథమ బహుమతి సాధించాడు.కార్యక్రమంలో విశ్రాంత శాస్త్రవేత్త సి.వెంకటరెడ్డి,వెంకయ్యనాయుడు,కాంతారెడ్డి, దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-10T05:11:32+05:30 IST