జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-08-26T05:28:42+05:30 IST

ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రారంభించారు.

జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌
ప్లాంట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, జేసీ, తదితరులు

ఏలూరు క్రైం, ఆగస్టు 25 : ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రారంభించారు. ఠాగూర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ యాజమాన్యాన్ని కలెక్టర్‌ అభినం దించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఆక్సిజన్‌ కొరత లేకుండా మెరుగైన వైద్య సేవలందించేందుకు దోహదపడుతుందన్నారు. ఠాగూర్‌ సంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేష్‌రాజు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. సంస్థ చైర్మన్‌ సుబ్రహ్మణ్యరాజు ఆధ్వ ర్యంలో మరిన్ని సేవా కార్య్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొం దించా మన్నారు. సంస్థ డైరెక్టర్‌ రామరాజు, జిల్లా జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్‌ భానునాయక్‌, ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-26T05:28:42+05:30 IST