చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-23T05:34:25+05:30 IST
స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో చిరంజీవి అభిమాన సంఘం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌ను మంగళవారం జిల్లా ఆసుపత్రుల సమన్వయ కమిటీ అధికారి ఏవీఆర్ మోహన్ ప్రారంభించారు.
ఏలూరు కార్పొరేషన్, జూన్ 22 : స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో చిరంజీవి అభిమాన సంఘం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌ను మంగళవారం జిల్లా ఆసుపత్రుల సమన్వయ కమిటీ అధికారి ఏవీఆర్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకా లంలో ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జనసేన ఏలూరు ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు, దెందులూ రు ఇన్చార్జి ఘంటశాల వెంకటలక్ష్మి, చిరంజీవి అభిమాన సంఘ నాయకులు కొప్పిశెట్టి వీరబాబు, నారా శేషు, ఇళ్ల శ్రీనివాస్, పేకేటి ప్రసాద్, శానం రామకృష్ణ, చిరంజీవి అభిమానులు, మెగా కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.