న్యాయశాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ పరీక్ష

ABN , First Publish Date - 2021-11-29T05:04:28+05:30 IST

న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీకోసం ఆదివారం నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు.

న్యాయశాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ పరీక్ష
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌

తాడేపల్లిగూడెం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీకోసం ఆదివారం నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు. తాడేపల్లిగూడెం వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం మూడు షిఫ్ట్‌లలో ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. న్యాయమూర్తి ప్రవీణ్‌ కు మార్‌ పరీక్షా కేంద్రాన్ని సందర్శిం చారు. ఆయన వెంట జిల్లా జడ్జి ఇ.బీమారావు, తాడేపల్లిగూడెం సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు, తణుకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.రాధిక, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.బాబు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-11-29T05:04:28+05:30 IST