ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు : ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-05-05T06:16:46+05:30 IST
ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావె ల్స్ బస్సు ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

పెనుగొండ, మే 4: ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావె ల్స్ బస్సు ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి పెనుగొండ మండలం సిద్దాంతం జాతీయ రహదారిపై ఉన్న వ్యవసాయ చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టినట్టు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన వేములపల్లి నాగ మల్లేశ్వరరావు (67) అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అతను చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్టు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.