లారీ ఢీకొని ఒకరి దుర్మరణం
ABN , First Publish Date - 2021-05-13T06:12:56+05:30 IST
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి పెట్రోల్ బంకు వద్ద లారీ ఢీకొని కిరాణా వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

తాడేపల్లిగూడెం రూరల్, మే 12: తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి పెట్రోల్ బంకు వద్ద లారీ ఢీకొని కిరాణా వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి, మండలంలోని పట్టింపాలెంకు చెందిన కారుమూరి కృష్ణమూర్తి (39) తాడేపల్లిగూ డెంలో కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. బుధవారం వ్యాపారం ముగించుకుని తన వాహనంపై మధ్యాహ్నం ఇంటికి బయల్దేరాడు. ఆ సమయంలో నీలాద్రిపురం నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న మినీ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎన్. శ్రీనివాస్ తెలిపారు.