ఆత్మీయ కలయిక..
ABN , First Publish Date - 2021-01-20T05:50:55+05:30 IST
పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 35 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకున్న 42 మంది పూర్వ విద్యార్థులు మంగళవారం పోలవరం గౌతమి రిసార్ట్స్‌లో కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

పోలవరంలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు
గత స్మృతులను పంచుకుని.. మళ్లీ కలుసుకుందామని బాసలు
పోలవరం, జనవరి 19: పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 35 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకున్న 42 మంది పూర్వ విద్యార్థులు మంగళవారం పోలవరం గౌతమి రిసార్ట్స్‌లో కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. మళ్లీ కలుసుకుందామని బాసలు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు జే.రాధాకృష్ణ, ఆకుల మురళీకృష్ణ, బొంగు నాగేశ్వరరావు, సోమరౌతు మల్లికార్జునరావు, కుమారస్వామి, కామేశ్వరి, సంజీవకుమార్ తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.