ముత్యాలపల్లి పాఠశాల అభివృద్ధికి రూ.1.5 లక్షల విరాళం
ABN , First Publish Date - 2021-01-21T04:07:47+05:30 IST
పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు.

డైనింగ్ హాల్ నిర్మాణానికి పూర్వ విద్యార్థి సహకారం
మొగల్తూరు, జనవరి 20: పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు. ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హల్ నిర్మాణానికి పొన్నమండ వెంకటేశ్వరరావు, అయన సతీమణి నాగ భార్గవి రూ.1.5 లక్షల చెక్కు బుధవారం అందజేశారు. డైనింగ్ హల్ నిర్మాణానికి సుమారు 4లక్షలు అవసరం కాగా తొలివిడత రూ.1.5 లక్షల చెక్కును పాఠశాల హెచ్ఎం బాల నాగమణి అందించారు.
దాత పొన్నమండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇదే పాఠశాలలో తాను విద్యనభ్యసిం చి అర్కెటెక్ట్గా, పురావస్తుశాఖలో కాంట్రాక్టర్‌గా చేస్తున్నానన్నారు. తాను చదివిన పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాగిడి భగవాన్, బంధన శ్రీనువాసు, వాటాల భాస్కరరావు, మురళీకృష్ణ, పొన్నమండ వెంకట నారాయణ, కొల్లాటి నాగేశ్వ రరావు, వాటాల అంజి, కొల్లాటి సుధాకర్, తిరుమాని సహదేవుడు, తిరుమాని సహదేవుడు, నాగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.