ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలు : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-02-06T06:09:23+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవల్ని వినియోగించుకుంటామని పోలవరం డీఎస్పీ కె.లతాకుమారి అన్నారు.

ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలు : డీఎస్పీ

జీలుగుమిల్లి, ఫిబ్రవరి 5 : పంచాయతీ ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవల్ని వినియోగించుకుంటామని పోలవరం డీఎస్పీ కె.లతాకుమారి అన్నారు. జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకునే క్రమంలో పోలీసులతోపాటు ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల్ని వెంట ఉంచుతామన్నారు.  ప్రతి గ్రామంలో వీరితోపాటు సచివాలయ పోలీస్‌ సిబ్బంది ఉంటారన్నారు.  సీఐ  మూర్తి  విద్యార్థులు  సెల్‌లో  వచ్చే మేసేజ్‌లకు  పాన్‌, ఆధార్‌ నెంబర్లు కొట్టటం వల్ల కలిగే నష్టాల్ని వివరించారు.  


Updated Date - 2021-02-06T06:09:23+05:30 IST