మద్యం ధరల తగ్గుదలతో.. మందు బాబుల్లో ఆనందం

ABN , First Publish Date - 2021-12-20T05:25:53+05:30 IST

రాష్ట్రంలో మద్యం ధరల్ని ప్రభుత్వం 15 నుంచి 20 శాతం తగ్గించింది.

మద్యం ధరల తగ్గుదలతో.. మందు బాబుల్లో ఆనందం
కొత్త రేట్లు ఆన్‌లైన్‌ కాకపోవడంతో మూతపడిన మద్యం దుకాణం

ధరలు ఆన్‌లైన్‌ కాక  ఉదయం  దుకాణాల మూత

మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మకాలు

ఇరగవరం, డిసెంబరు 19:  రాష్ట్రంలో మద్యం ధరల్ని ప్రభుత్వం 15 నుంచి 20 శాతం తగ్గించింది. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌ పై కనీసం 20 నుంచి 50 వరకు, ఫుల్‌బాటిల్‌పై 120 నుంచి 200 వరకు తగ్గించింది. అన్ని రకాల  బీర్లపై రూ. 20 నుంచి 30 వరకు ధర తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆదివారం నుంచి అమలు కావాల్సివుండగా కొత్త రేట్ల పట్టిక దుకాణ సూపర్‌వైజర్లకు ఆదేశాలు అందక పోవడంతో ఉదయం నుంచి దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వం మద్యం రేట్లు తగ్గించిందన్న వార్త విన్న మందు బాబులు ఆనం దంతో ఉదయం నుంచే మద్యం దుకాణాల బాట పట్టారు. అయితే మద్యం దుకాణాల్లో సవరించిన రేట్లు ఆన్‌లైన్‌లో నందు నమోదుకాక దుకాణాలను మూసివేయడంతో నిరాశకు గురయ్యారు.  ఎట్టకేలకు 3 గంటల సమయానికి సవరణ పూర్తవడంతో దుకాణాలు తెరుచుకున్నాయి. 

Updated Date - 2021-12-20T05:25:53+05:30 IST