నాన్‌ లేఅవుట్‌లపై రెవెన్యూ కన్ను

ABN , First Publish Date - 2021-10-26T05:24:43+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టింది. వ్యవసాయ భూములను మెరక చేసి నాన్‌ లేఅవుట్‌లు వేసిన వెంచర్లపై కొరడా ఝులిపించనుంది.

నాన్‌ లేఅవుట్‌లపై రెవెన్యూ కన్ను

భూమార్పిడి లేకుంటే జరిమానాలు

10 శాతం పన్ను వసూలుకు రంగం సిద్ధం

ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని వెంచర్లు

వాటిపైనే అధికారుల దృష్టి.. సిబ్బంది కొరతతో సతమతం  

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టింది. వ్యవసాయ భూములను మెరక చేసి నాన్‌ లేఅవుట్‌లు వేసిన వెంచర్లపై కొరడా ఝులిపించనుంది. భారీగా పన్ను వసూలు చేసేం దుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖ ఇప్పుడు సర్వేలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తాజాగా వెంచర్లుగా మారిన వ్యవసాయ భూములను గుర్తించాలని ఆదే శాలు వచ్చాయి. ఆ మేరకు పట్టణాలు, పల్లెల్లో వెంచర్లను గుర్తించనున్నారు. 

ఇటీవల కాలంలో ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటూ వెంచర్లు వేస్తు న్నారు. నేతల అనుమతి ఉంటే అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు ఉండవన్న నమ్మ కంతో రియల్‌ ఎస్టేట్‌ దారులు నాన్‌ లేఅవుట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. నేతలకు కాసులు ముట్ట చెపుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడు తోంది.ఇటీవల కాలంలో రెవెన్యూ ఆదాయం పడిపోయింది. దాంతో ఇప్పుడు వెంచర్లపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయ భూము లను నివాసయోగ్యతగా మార్చిడి చేయ కుండా వెంచర్లు వేస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. వాస్తవానికి భూ విని యోగ మార్పిడి పన్ను ఇటీవల ప్రభుత్వం పెంచింది. గతంలో మూడు శాతం ఉండగా దానిని ఐదు శాతానికి పెంచారు. ముందుగా దరఖాస్తు చేసుకుని భూ వినియోగ మార్పిడి చేసుకుంటే ఐదు శాతం పన్ను మాత్రమే వసూలు చేస్తారు. అలా కాకుండా వెంచర్లు వేసినట్టయితే అధికారులు గుర్తించి పన్నుతో పాటు, మరో 5 శాతం జరిమానా వసూలు చేయనున్నారు. మొత్తంపైన రిజిస్ర్టేషన్‌ విలువలో 10 శాతం వసూలు చేస్తారు. ఇటీవలే రెవెన్యూ శాఖకు ఆ దిశగా ఆదేశాలు అందాయి. ప్రస్తుతం రెవెన్యూ సిబ్బంది ఇందిరమ్మ ఇళ్ల గుర్తింపులో నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే వెంచర్లపై దృష్టి పెడతారు.   

రిజర్వుడ్‌ స్థలాలు వదలడం లేదు

జిల్లాలో పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాలు, మండల కేంద్రాల్లో వెంచర్లు వేస్తున్నారు. వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారుస్తున్నారు. నాన్‌ లేఅవుట్‌లు వేసి గజాల రూపంలో స్థలాలను విక్రయిస్తున్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు. స్థానిక సంస్థ లకు 10 శాతం రిజర్వుడ్‌ స్థలాలను విడిచి పెట్టడం లేదు. భూమార్పిడి చేయకుండా స్థలాల విక్రయాలు సాగుతున్నాయి. అటువంటి వాటిని గుర్తించి పన్ను వేసేలా రెవెన్యూశాఖ ప్రణాళిక చేస్తోంది. అయితే జిల్లాలోని చాలా తహసీల్దార్‌ కార్యాల యాల్లో సిబ్బంది కొరత వెంటాడుతోంది.  ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలు అమలు చేయాలంటే కష్టతరంగా ఉంది. 

Updated Date - 2021-10-26T05:24:43+05:30 IST