మా గ్రామంలోకి రావద్దు

ABN , First Publish Date - 2021-05-08T05:45:24+05:30 IST

గ్రామాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కె. పెంటపాడు గ్రామస్థులు గ్రామంలోకి కొత్తవారెవరూ రావద్దంటూ శుక్రవారం ప్రధాన సరిహద్దులను మూసివేశారు.

మా గ్రామంలోకి రావద్దు
కె.పెంటపాడు సరిహద్దులను మూసిన సర్పంచ్‌ సత్యనారాయణ, తదితరులు

 కె.పెంటపాడులో గ్రామ సరిహద్దులు మూసివేత

పెంటపాడు, మే 7 : గ్రామాల్లో  కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కె. పెంటపాడు గ్రామస్థులు గ్రామంలోకి కొత్తవారెవరూ రావద్దంటూ శుక్రవారం ప్రధాన  సరిహద్దులను మూసివేశారు. గ్రామ సర్పంచ్‌ పీతల సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రధాన సరిహద్దులను మూసివేశామన్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరంతరం శానిటేషన్‌ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పంతం శివరామకృష్ణ, కార్యదర్శి నాగరాజు, గోకా వెంకటేశ్వరరావు, మిరియాల శేషు, నరాలశెట్టి సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T05:45:24+05:30 IST