కరెంట్‌ కట్‌ కట్‌కు చెక్‌..

ABN , First Publish Date - 2021-10-29T05:01:26+05:30 IST

కరెంట్‌ కట్‌ కట్‌లకు కాలం చెల్లనుంది.

కరెంట్‌ కట్‌ కట్‌కు చెక్‌..
అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

నరసాపురంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు


నరసాపురం,అక్టోబరు 28 :  కరెంట్‌ కట్‌ కట్‌లకు కాలం చెల్లనుంది. నరసాపు రం,పాలకొల్లు నియోజక వర్గాల్లో ప్రస్తుతం ఉన్న 80 ఏంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌కు జతగా మరో 50 ఎంవీఏను జత చేస్తు న్నారు. దీని వల్ల రానున్న రెండేళ్లలో నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, పోడూరు, పాలకొల్లు పట్టణ, మండలాల్లో లోవోల్టేజ్‌ సమస్య తీరనుంది. ఈ రెండు నియోజక వర్గాల్లో మామూలు రోజుల్లో 60 మెగా వాట్లు, వేసవి అయితే 90 మెగా వాట్లు విద్యుత్‌ అవసరం అవు తోంది. దీని వల్ల సబ్‌ స్టేషన్లపై అదనపు లోడ్‌ పడుతోంది. అయితే దానికి అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్‌ సామర్థ్యం లేకపోవడంతో కొన్ని చోట్ల కోతలు విధించాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు ట్రాన్స్‌కో ప్రస్తుతం నరసాపురంలో ఉన్న 80 ఎంవీఏ సబ్‌స్టేషన్‌ను ఆధునీకరిస్తుంది. కొత్తగా మరో 50 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసే పనులను సోమవారం నుంచి ప్రారం భించారు. వచ్చే నెలాఖరు నాటికి పూర్తి కానున్నాయి. దీని వల్ల కొత్తగా విద్యుత్‌ కనెక్షన్లు పెరిగినా... దానికి అనుగుణంగా సరఫరా చేసే అవకాశం ఏర్పడనుంది.   

Updated Date - 2021-10-29T05:01:26+05:30 IST