చేబ్రోలు పీహెచ్‌సీకి జాతీయ పురస్కారం

ABN , First Publish Date - 2021-08-21T04:34:52+05:30 IST

చేబ్రోలు ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామీణ ప్రాంతాల వైద్యసేవలలో జాతీయ ప్రమాణాల హామీ పఽథకం (నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ పఽథకం) కింద పురస్కారాన్ని దక్కించుకుంది.

చేబ్రోలు పీహెచ్‌సీకి జాతీయ పురస్కారం
చేబ్రోలు పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది

కాగుపాడుకు కాయకల్ప అవార్డు

ఉంగుటూరు, ఆగస్టు 20: చేబ్రోలు ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామీణ ప్రాంతాల  వైద్యసేవలలో జాతీయ ప్రమాణాల హామీ పఽథకం (నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ పఽథకం) కింద పురస్కారాన్ని దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఆరోగ్య కేంద్రాలకు జాతీయ పుస్కారాలు దక్కాయి. పశ్చిమగోదావరి జిల్లా నుంచి చేబ్రోలు పీహెచ్‌సీకి ఈ సేవా పురస్కారం అందడం విశేషం.ఈ సేవలకు గాను నగదు రూపేణా (ఆరు పడకల ఆసుపత్రికి ఒక్కొక్క పడక లెక్కన రూ.25వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు)రూ.1.50లక్షల నగదును ఆసుపత్రి తరపున వైద్యాధికారి కలిదిండి సుబ్బరాజవర్మకి అందిస్తారు. వర్చువల్‌ విధానంలో జాతీయ నాణ్యతా ప్రమాణాల కమిటీ జూన్‌ 17వ తేదీన ఈ ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించింది. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రసూతి విభాగం నిర్వహణకు ల్యాబ్‌ సదుపాయం, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రమైన వాతావరణంతో పాటు పారిశుధ్యం వంటి అంశాలను కమిటీ పరిశీలించింది. అలాగే కాగుపాడు పీహెచ్‌సీకి కాయకల్ప చికిత్సలో పీహెచ్‌సీల విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. ఈ ఆస్పత్రికి వైద్యాధికారిగా డాక్టర్‌ డోలా జోషిరాయ్‌ ఉన్నారు. ఈ రెండు ఆసుపత్రుల సిబ్బంది కరోనా వేళ నిరంతరాయంగా సేవలందించారు. డాక్టర్‌ వర్మ రెండు సార్లు కరోనాతో ఇబ్బంది పడినా సేవలలో రాజీ లేకుండా కృషి చేశారు.
Updated Date - 2021-08-21T04:34:52+05:30 IST