‘నన్నయ’ వాలీబాల్ మహిళల జట్టు ఎంపిక
ABN , First Publish Date - 2021-12-09T05:37:17+05:30 IST
నన్నయ విశ్వ విద్యాలయ మహిళల వాలీబాల్ జట్టును బుధవారం ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజా మారిసన్ ప్రకటించారు.

ఉంగుటూరు, డిసెంబరు 8 నన్నయ విశ్వ విద్యాలయ మహిళల వాలీబాల్ జట్టును బుధవారం ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజా మారిసన్ ప్రకటించారు. టి.దేవి, ఆర్.సీతామహాలక్ష్మి (ఎస్‌కేఎస్‌డీ, తణుకు) టి.అరుణ (ఎస్‌కేవీటీ, రాజమహేంద్ర వరం) జి.పి.జ్యోతి ఐడియల్ (కాకినాడ), పి.కీర్తి, జే.కీర్తి (సీఎస్‌టీఎస్, జంగారెడ్డి గూడెం) కే.ఉమాదేవి (ఆర్ట్స్ కళాశాల, రాజ మహేంద్రవరం), డి.మేరి (ఏఎస్‌డీ, కాకినాడ) ఎం.దుర్గా ప్రసన్న (సీఆర్‌ఆర్, ఏలూరు) ఎస్.శిరీష (ఎసీవీడీ, నిడదవోలు, ఎం.దీపిక (డీఎన్నార్, భీమవరం) కీర్తన (శ్రీ అరవింద శత జయంతి, నారాయణపురం) స్టాండ్‌బై క్రీడాకారులుగా కె.నాగమల్లేశ్వరి, వైకే.పూర్ణిమ, పి.అనురాధ, పి.రత్నకుమారి ఎంపికయ్యారు.
చాంపియన్ తణుకు
నారాయణపురం కళాశాల ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న మహిళల చాంపియన్, యూనివ ర్సిటీ జట్టు ఎంపిక పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో తణుకు ఎస్‌కేఎస్‌డీ కళాశాల జట్టు ఛాంపి యన్‌గా నిలిచింది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ కళాశాల జట్టు ద్వితీయ స్ధానం, ఏఎస్‌డి కళాశాల(కాకినాడ)జట్టు తృతీయ స్ధానం పొందినట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి, కళాశాల పీడీ రజా మారిసన్ తెలిపారు. ముగింపు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మరడ రమావతి, సర్పంచ్ దిడ్ల అలకనంద, యెలిశెట్టి పాపారావు బాబ్జి, మరడ మంగారావు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కొండా రవి, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు బొమ్మిడి అప్పారావు పాల్గొన్నారు.