అన్నను హతమార్చిన తమ్ముడు

ABN , First Publish Date - 2021-08-26T05:25:22+05:30 IST

కుటుంబ కలహా లు, తన పెళ్లికి అడ్డు వస్తున్నాడనే కక్షతో సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన సంఘటన కామవర పుకోట మండలం వీరంపాలెంలో చోటు చేసుకుంది.

అన్నను హతమార్చిన తమ్ముడు
విలేకరుల సమావేశంలో వివరాలు తెలుపుతున్న చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు

కుటుంబ కలహాలు..పెళ్లికి అడ్డు వస్తున్నాడని..

కామవరపుకోట, ఆగస్టు 25 : కుటుంబ కలహా లు, తన పెళ్లికి అడ్డు వస్తున్నాడనే కక్షతో సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన సంఘటన కామవర పుకోట మండలం వీరంపాలెంలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్న రాజేష్‌ (23)ను తమ్ముడు కృష్ణ మోహన్‌ (20) నాటు తుపాకీతో కాల్చి చంపిన ట్టు చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. తడిక లపూడి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆయన విలేకరు లకు వివరాలు తెలిపారు. వీరంపాలేనికి చెందిన కూతాడ సుబ్బారావుకు ఇద్దరు కుమారులు. ఇద్దరికీ వివా హాలు కాకపోవడంతో తల్లిదండ్రులతో ఉంటు న్నారు. రాజేష్‌ తరచూ తండ్రి, తమ్ముడితో గొడవలు పడే వాడని ఒకసారి దాడి కూడా చేశాడని చెబుతు న్నారు. బతుకు దెరువు కోసం ఆటో కొనుగోలు చేసి ఇస్తే దానికి వాయిదాలు కట్టక పోవడంతో ఫైనాన్స్‌ వారు  తీసుకు వెళ్లిపోయారని మళ్లీ ఆటో కొనా లంటూ తండ్రి, తమ్ముడితో గొడవపడేవాడన్నారు. అంతేకాకుండా కృష్ణమోహన్‌ ఒక యువతిని ప్రే మించాడు.పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటు కున్నాడు. యువతి తరపు నుంచి కూడా పెళ్లికి ఒత్తిడి పెరిగింది. అన్నకు పెళ్లికాక పోవడం.. ఇంటి లో తరచూ గొడవలు.. అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే కృష్ణమోహన్‌ అన్నను హతమార్చాడని చెబుతున్నారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తామని నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. తడికలపూడి ఎస్‌ఐ కె.వెంకన్న ఉన్నారు.


Updated Date - 2021-08-26T05:25:22+05:30 IST