భీమవరంలో మునిసిపల్‌ ఆర్‌డీ విచారణ

ABN , First Publish Date - 2021-08-07T04:59:48+05:30 IST

మునిసిపాలిటీలో మూడు వార్డుల సచివాలయాలకు సంబంధించి వలంటీర్లు కాని వారికి వేతనాల రూపంలో సుమారు రూ. 60 వేలు ముగ్గురికి చెల్లించిన ఘటనపై మునిసిపల్‌ ఆర్‌డీ ఎ.మోహనరావు శుక్రవారం మునిసిపాలిటీలో విచారణ చేశారు.

భీమవరంలో మునిసిపల్‌ ఆర్‌డీ విచారణ

భీమవరంటౌన్‌, ఆగస్టు 6 : మునిసిపాలిటీలో మూడు వార్డుల సచివాలయాలకు సంబంధించి వలంటీర్లు కాని వారికి వేతనాల రూపంలో సుమారు రూ. 60 వేలు ముగ్గురికి చెల్లించిన ఘటనపై మునిసిపల్‌ ఆర్‌డీ ఎ.మోహనరావు శుక్రవారం మునిసిపాలిటీలో విచారణ చేశారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీకాంత్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పెద్దిరాజు, టీపీఆర్‌వో ప్రియంవదతో పాటు 3,21,36 వార్డులకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీలను విచారించారు. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.ఆర్డీకి మునిసిపల్‌ జేఏసీ నాయకులు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందించారు.   


Updated Date - 2021-08-07T04:59:48+05:30 IST