‘ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలి’

ABN , First Publish Date - 2021-02-27T04:45:17+05:30 IST

:ప్రశాంతంగా ము న్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి సూచించారు.

‘ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలి’
పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో లక్ష్మారెడ్డి

కొవ్వూరు, ఫిబ్రవరి 26:ప్రశాంతంగా ము న్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి సూచించారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం లో కొవ్వూరు, నిడదవోలు మున్సిపాల్టీలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి పోలీసు అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నందున పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు సామాజిక దూరాన్ని పాటిం చడం, మాస్క్‌ ధరించడం, శానిటైజర్లు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌, పోలవరం డీఎస్పీ లతాకుమారి, నిడదవోలు సీఐ స్వామి తదితరులు పాల్గొన్నారు.


ఓటర్లు ప్రలోబాలకు లొంగవద్దు..

ఓటర్లు ఎటువంటి ప్రలోబాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియెగించుకోవాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు. పట్టణంలోని రాజీవ్‌కాలనీలో మున్సిపల్‌ కమిషనర్‌ కేటీ సుధాకర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఓటర్ల చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్డీవో మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలోబాలకు గురికావద్దు అన్నారు. తహసీల్దా ర్‌ బి.నాగరాజు నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 


ఓటర్లకు స్లిప్‌లు అందించాలి : కమిషనర్‌ సుధాకర్‌ 

పట్టణంలోని ప్రతీ ఒక్కరికి ఓటరు స్లిప్‌లు అందించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కేటీ సుధాకర్‌ సూచించారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో బూత్‌ లెవెల్‌ అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్‌కు మూడు రోజులు ముందుగా ఓటరు స్లిప్‌లు అందజేయాలన్నారు. 

Updated Date - 2021-02-27T04:45:17+05:30 IST