దళితులపై దాడులు అరికట్టాలి

ABN , First Publish Date - 2021-10-29T05:06:15+05:30 IST

దళితులపై దాడులను అరికటాఆ్టలని ఎమ్మార్పీఎస్‌ నేతలు కోరారు.

దళితులపై దాడులు అరికట్టాలి
వినతిపత్రం ఇస్తున్న ఎమ్మార్పీఎస్‌ నేత

జంగారెడ్డిగూడెం, అక్టోబరు 28: దళితులపై దాడులను అరికటాఆ్టలని ఎమ్మార్పీఎస్‌ నేతలు కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఏలూరు వచ్చిన ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌కు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్‌ వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, బాలికలపై దాడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రెండెకరాల పొలం ఇవ్వాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండల శ్రీనివాసపురంలో దళిత యువకుడు రాజు హత్య విషయంపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జూవరపు ప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి రాజు, కలపాల శ్రీనివాసరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:06:15+05:30 IST