పరిషత్‌ ఫలితాలు నేడే..

ABN , First Publish Date - 2021-09-19T05:07:14+05:30 IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగి సరిగ్గా 164 రోజులైంది. అనేక అవాంతరాల మధ్య ఇప్పటి వరకు కౌంటింగ్‌ జరగలేదు

పరిషత్‌ ఫలితాలు నేడే..
వట్లూరు కౌంటింగ్‌ కేంద్రంవద్ద ఏర్పాట్లు

ఉదయం 8 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఏలూరు, భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెంలలో కౌంటింగ్‌ కేంద్రాలు

45 జడ్పీటీసీలకు 187 మంది, 781 ఎంపీటీసీలకు 2,041 మంది పోటీ

బరిలో వైసీపీ, టీడీపీ, జనసేన సహా పలు పార్టీలు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. సిబ్బందికి పూర్తయిన శిక్షణ

పరిశీలించిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌


ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగి సరిగ్గా 164 రోజులైంది.  అనేక అవాంతరాల మధ్య ఇప్పటి వరకు కౌంటింగ్‌ జరగలేదు. అప్పటి నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌లలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. చివరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. మరికాసేపటిలో అభ్యర్థుల జాతకాలు బయట పడనున్నాయి. ఎవరు విజేతలో ? మరెవరు పరాజితులో తేలిపోనుంది. అయితే ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరించి.. గత ఏప్రిల్‌లో పోలింగ్‌ నిర్వహిస్తోందని ఆరోపిస్తూ అప్పట్లో టీడీపీ మొత్తం ఎన్నికలనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు చాలాచోట్ల నామినేషన్‌ వేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించలేదు. అయినప్పటికీ కొన్నిచోట్ల టీడీపీ స్థానిక నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టి పోటీ ఇచ్చింది. జనసేనతోపాటు పలు పార్టీలు బరిలో నిలిచాయి.


ఏలూరుసిటీ, సెప్టెంబరు 18 : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగి ఐదు నెలలు దాటింది. ఎన్నికల కౌంటింగ్‌ నిలిపివేయడంతో  పోటీచేసిన అభ్య ర్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. హైకోర్టు తీర్పుతో నేడు టెన్షన్‌కు తెరపడనుంది. కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు జిల్లాలోని ఐదు డివిజన్లకు సంబంధించి నాలుగుచోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.  జిల్లాలో 45 జడ్పీటీసీలకు సంబం ఽధించి 187 మంది అభ్యర్థులు, 781 ఎంపీటీసీలకు సంబంధించి 2,041 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు. కౌంటింగ్‌కు సంబంఽధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలూరు డివిజన్‌కు సంబం ధించి వట్లూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో భీమడోలు, చింతలపూడి, ద్వారకా తిరుమల, దెందులూరు, ఏలూరు, గణపవరం, కామవరపుకోట, లింగపాలెం, నల్లజర్ల, నిడమర్రు, పెదపాడు, పెదవేగి, పెంటపాడు, తాడేపల్లి గూడెం, టి.నరసాపురం, ఉంగుటూరు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కొవ్వూరు డివిజన్‌కు సంబంధించి తణుకు ఏఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో అత్తిలి, చాగల్లు, దేవరపల్లి, గోపా లపురం, ఇరగవరం, కొవ్వూరు, నిడదవోలు, పెనుగొండ, పెనుమంట్ర, పెర వలి, తాళ్లపూడి, తణుకు, ఉండ్రాజవరం మండలాల అభ్యర్థులకు, నరసా పురం డివిజన్‌కు సంబంధించి భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళా శాలలో ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నరసాపురం, పాల కోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి మండలాల అభ్యర్థులకు, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్లకు సంబంధించి జంగా రెడ్డిగూడెం నోవా ఇంజనీరింగ్‌ కళాశాలలో బుట్టాయిగూడెం, జంగారెడ్డి గూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 48 కౌంటింగ్‌ గదులలో 715 టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మూడు వేల 693 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 905 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 2,788 మంది అసిస్టెంట్లు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ముగ్గురు అసిస్టెంట్లు కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తారు. ముందుగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యి విజేతలను ప్రకటించిన తర్వాత, జడ్పీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మధ్యాహ్నానికి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దీనిపై ఇప్పటికే గ్రామాల్లో జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. 


ఓట్ల లెక్కింపు పక్కాగా ఉండాలి 

పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌

‘ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. వేగంగా లెక్కించినా లెక్క పక్కాగా ఉండాలి’  అని పంచాయతీరాజ్‌ రాష్ట్ర కమిషనర్‌ ఎం.గిరిజా శంకర్‌ అన్నారు. ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించి, సిబ్బంది శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. సందేహాత్మక ఓట్ల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ సమష్టిగా పని చేస్తే ఫలితం త్వరగా రాబట్టగలమన్నారు. కమిషనర్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ను, ఓట్ల లెక్కింపు హాళ్లను పరిశీలించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్తికేయ మిశ్రా, జేసీలు అంబేడ్కర్‌, ఆర్డీవో రచన, ఏలూరు డివిజన్‌ ఎస్‌డీపీవో దిలీప్‌కిరణ్‌, ఇన్‌చార్జ్‌ జెడ్పీ సీఈవో రమేశ్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

ప్రశాంతంగా జరగాలి : కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

కౌంటింగ్‌ ప్రశాంతంగా సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీవోలు, ఆర్‌వోలు, మండల ప్రత్యేకాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ‘కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటలకు సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తిచేసి వారికి నిర్ధేశించిన టేబుల్‌ వద్దకు డ్యూటీకి పంపించాలి. పద్ధతి ప్రకారం ఫలితాలను ప్రకటించాలి. కౌంటింగ్‌ హాల్లో సీసీ కెమేరాలు, మీడియా సెంటర్‌, కౌంటింగ్‌ కోసం వచ్చేవారికి పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఏ మండలానికి ఎక్కడ కౌంటింగ్‌ చేస్తారనేది సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి’ అని ఆదేశించారు.


పటిష్ట బందోబస్తు : ఎస్పీ రాహుల్‌ 

ఏలూరు క్రైం, సెప్టెంబరు 18 : కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహిం చేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. ఏలూరు సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో  శనివారం రాత్రి కౌం టింగ్‌ బందోబస్తు కోసం ఏర్పాటు చేసిన పోలీసుల అధికారులు, సిబ్బందితో ఎస్పీ సమావేశమయ్యారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ నిర్వహించేందుకు అంతా కష్టపడి పనిచేయాలన్నారు. సిబ్బంది, అభ్యర్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. 144 సెక్షన్‌,  పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చడం వంటి చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ దిలీప్‌ కిరణ్‌,  డీఎస్పీ శుభాకర్‌, త్రీటౌన్‌  సీఐ వరప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐ డీవీ రమణ, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-09-19T05:07:14+05:30 IST