పోస్టుకార్డు ఉద్యమం పొడిగింపు : జోగయ్య
ABN , First Publish Date - 2021-10-28T05:34:41+05:30 IST
విద్యా, ఉద్యోగాల్లో బీసీలు, మైనార్టీలకు నష్టం కలగ కుండా పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో లక్ష మందికి పైగా కాపులు సీఎంకు ఉత్తరాలు రాయడానికి కాపు సంక్షేమ సేన పిలుపునిచ్చిందని వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

పాలకొల్లు, అక్టోబరు 27 : విద్యా, ఉద్యోగాల్లో బీసీలు, మైనార్టీలకు నష్టం కలగ కుండా పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో లక్ష మందికి పైగా కాపులు సీఎంకు ఉత్తరాలు రాయడానికి కాపు సంక్షేమ సేన పిలుపునిచ్చిందని వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యమం ఈ నెలాకరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినా కొన్ని ప్రాంతాల్లో పోస్టుకార్డుల కొరతతో నవంబరు 10 వరకూ పొడిగించినట్టు తెలిపారు. ప్రభుత్వం నవంబరు నెలాఖరులోగా జనాభా ప్రాతిపాదికపై బీసీలుగా గుర్తించడం గానీ, 5 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గానీ వర్తింపజేయకుంటే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఐకమత్యంగా ఉన్నామనే సంకేతాన్నివ్వడమే ధ్యేయంగా కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వన భోజనాలు నిర్వహించాలని సూచించారు.